కొవిడ్ రిపోర్టు లేకున్నా… దేశీయ విమానయానం?

టీకా రెండు డోసులు పూర్తయినవారికి దేశీయ విమానాల్లో ప్రయాణానికి కొవిడ్ నెగెటివ్ నివేదిక తప్పనిసరి నిబంధనను ఎత్తేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ప్రస్తుతం అనేక రాష్ట్రాలు కొవిడ్ నెగెటివ్ నివేదిక (అదీ 72 గంటల్లోపు తీసుకున్నది) ఉన్న ప్రయాణికులను మాత్రమే బయటి ప్రాంతాల నుంచి అనుమతిస్తున్నాయి. దీంతో దేశీయ విమానయాన రంగం భారీగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులకు ఈ కొవిడ్ నివేదిక నుంచి మినహాయింపునిచ్చేలా చర్చలు సాగుతున్నాయి. పౌరవిమానయాన శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు.. ఇతర భాగస్వాములతో దీనిపై చర్చిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర అన్ని రాష్ట్రాలతో దీనిపై చర్చిస్తున్నట్లు సమాచారం.