నీట్ పీజీ పరీక్ష వాయిదా
నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. 6-8 వారాల పాటు వాయిదా వేసినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 12న జరగాల్సిన నీట్ పరీక్ష.. వాయిదా పడినట్లు అయింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ పీజీ)పరీక్ష 2022ని వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే అంతకు ముందే నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.













