కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
దేశంలో కరోనా ఉధృతి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. మరికొన్ని పరీక్షలను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 18న జరుగాల్సిన నీట్-పీజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-పోస్ట్‌గ్రాడ్యుయేట్) పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిర హర్షవర్ధన్ తెలిపారు. యువ వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. పరీక్షల నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. కరోనా వైరస్ రెండో విజృంభణ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో వైద్యుల బృందం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.













