కేంద్ర మరో కీలక నిర్ణయం.. నీట్ పీజీ పరీక్షలను

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదివే విద్యార్థులను విధుల్లోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నీట్-పీజ్ పరీక్షను నాలుగు నెలల పాటు వాయిదా వేసింది. కొవిడ్ పై పోరు వైద్య సిబ్బంది కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే బీఎస్సీ, జీఎన్‍ఎం ఉత్తీర్ణులైన నర్సులను, సీనియర్ డాక్టర్లు, సీనియర్ నర్సుల పర్యవేక్షణలో పూర్తి స్థాయి కొవిడ్ నర్సింగ్ విధుల్లోకి తీసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం నీట్ పీజీ పరీక్షను నాలుగు నెలలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ పరీక్ష ఏప్రిల్ 18న జరగాల్సి ఉండగా కరోనా దృష్టా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. అంతేగాక, 100 రోజుల కరోనా విధుల్లో ఉన్న వైద్య సిబ్బందికి భవిష్యత్తులో జరగబోయే ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.