నామినేషన్ వేసిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి.. ద్రౌపదీ ముర్మూ
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్మూ నామినేషన్ దాఖలు చేశారు. ఢల్లీిలోని ఒడిశా భవన్ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న ఆమె తన పత్రాలను సమర్పించారు. ఆమె వెంట వచ్చిన ప్రధాని మోదీ వాటిని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ముర్మూ అభ్యర్థిత్వం కోసం బీజేపీ నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సిద్ధం చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వాటిపై సంతకాలు పెట్టారు. ఇక నామినేషన్ సమయంలో వీరితో పాటు బీజేపీ, ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.













