భారత్, అమెరికా విన్యాసాలు..

హిందూ మహాసముద్రంలో భారత్, అమెరికా రెండు రోజుల యుద్ధ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ఈ కసరత్తును చేపట్టాయి. అమెరికా నుంచి అణ్వాయుధ విమాన వాహక నౌక రొనాల్డ్ రీగన్, ఎఫ్-18 తరహా యుద్ధ విమానాలు, ఈ- 2సీ హకేయే తరహా సర్వవాతవరణ విమానాలు, క్షిపణులను ధ్వంసం చేసే హల్సీ, క్షిపణి వాహక నౌక షిలోహ్‍లు వచ్చాయి. ఆ దేశానికి చెందిన క్యారియర్ స్ట్రైక్ గ్రూపు విన్యాసాల్లో పాల్గొంది. భారత్ నౌకా దళం తరపున జాగ్వార్, సుఖోయ్ యుద్ధ విమానాలు, ఆకాశంలోనే ఇంధనం నింపే ఐల్-78 అయిల్ ట్యాంకర్ విమానాలు, అవాక్స్ విమానాలు, కోచి, తేజ్ యుద్ధ నౌకలు పీ8ఐ నిఘా విమానం వంటివి భాగస్వాములయ్యాయి.