రికార్డు బద్దలుకొట్టిన మోదీ యూట్యూబ్ ఛానెల్.. ప్రపంచంలోనే అత్యధికంగా!
అయోధ్య రామ మందిరంలో రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పలు రికార్డులను నమోదు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్ సైతం రికార్డును నెలకొల్పింది. లైవ్ స్ట్రీవ్లో ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన యూట్యూబ్ ఛానెల్‌గా ప్రధాని ఛానెల్ నిలిచింది. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠను నరేంద్ర మోదీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. ఏకకాలంలో 90 లక్షల మందికి పైగా ఒకేసారి ప్రత్యక్షంగా రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఏ యూట్యూబ్ ఛానెల్‌లోనైనా లైవ్ స్ట్రీమింగ్‌ను ఇంత పెద్ద సంఖ్యలో వీక్షించడం ఇదే రికార్డు.













