ఢిల్లీ లో ఉండి స్వీడన్ లో కారు నడిపిన మోదీ
ఢిల్లీ లో ప్రగతి మైదాన్‌లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) వేదికగా 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎరిక్సన్ స్టాల్ నుంచి 5జీ కనెక్షన్ ద్వారా రిమోట్ మోడ్‌లో ప్రధాని మోదీ స్వీడన్లో కారును డ్రైవ్ చేశారు. యూరప్‌లోని ఇండోర్ కోర్స్‌లో వాహనాన్ని ఉంచగా కంట్రోల్స్ ఇవ్వడం ద్వారా కారును నడిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ రిలయన్స్ పెవిలియన్‌ను సందర్శించి జియో గ్లాస్ ద్వారా ట్రూ 5జీ డివైజ్‌లను పరిశీలించారు. ఇక భారత్‌లో 5జీ సేవలను ప్రధాని లాంఛనంగా ప్రారంభించడంతో యూజర్లు దీపావళి నుంచి 5జీ సేవలను ఆస్వాదించనున్నారు.













