నరేంద్ర లూథర్ ఇకలేరు …
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రచయిత, కాలమిస్ట్ నరేంద్ర లూథర్(88) కన్నుమూశారు. లూథర్కు భార్య బింది, కుమారుడు రాహుల్, కుమార్తె సంధ్యా ఉన్నారు. పంజాబ్‌లోని హోషియాపూర్‌లో 23 మార్చి 1932న జన్మించారు. ఉమ్మడి ఏపీ సీఎస్‌గా పదవీ విరమణ పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. అదేవిధంగా పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం, దాని పాలకుల చరిత్ర, సంస్కృతిపై లూథర్ పనిచేశారు. హైదరాబాద్‌లోని సేవ్ టు రాక్స్ సొసైటీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. నరేంద్ర లూథర్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. వివిధ హోదాలో పనిచేసిన ఆయన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. లూథర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతిని తెలిపారు.













