మనవడికి ఖరీదైన గిప్ట్ ఇచ్చిన.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన మనవడు ఏకాగ్రప్ా రోహన్ మూర్తికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా కంపెనీలో 15 లక్షల షేర్లను అతని పేరు మీద రిజిస్టర్ చేశారు. వీటి విలువ సుమారు రూ.240 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కంపెనీలో తన వాటా షేర్లలో కొన్నింటిని మనవడికి బహుమతిగా ఇచ్చినట్లు తెలిసింది. నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్లో 0.40 శాతం వాటా ఉంది. ఆయన వద్ద 1.51 కోట్ల కంపెనీ షేర్లు ఉన్నాయి. గతేడాది నవంబరులో ఆయన కొడుకు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్లకు ఏకాగ్రప్ా జన్మించాడు. తాత ఇచ్చిన విలువైన బహుమతితో ఏకాగ్రప్ాకు ఇన్ఫోసిస్లో 0.04 శాతం వాటా లభించింది. దీంతో భారత్లో అత్యంత పిన్నవయస్కుడైన మిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడని మార్కెట్ వర్గాలు తెలిపాయి.













