పుదుచ్చేరి పీఠంపై రంగస్వామి

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్‍ఆర్‍సీ నేత ఎన్ రంగస్వామి నాలుగోసారి ప్రమాణం చేశారు. రాజ్‍నివాస్‍లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీతో కలిసి ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి రంగస్వామి నేతృత్వం వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏఐఎన్‍ఆర్‍సీ, బీజేపీల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులుగా త్వరలో ప్రమాణ చేస్తారని వెల్లడించారు. బీజేపీ శాసనసభాపక్షనేతగా ఎన్నికైన నమిశ్శి వాయం వీరిలో ఒకరని అన్నారు. ఈయనకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఇస్తారని భావిస్తున్నారు. రంగస్వామి కాంగ్రెస్‍లో ఉన్నపుడు 2001, 2006లో, ఎన్నార్ కాంగ్రెస్‍ను ప్రారంభించిన తర్వాత 2011లో ముఖ్యమంత్రిగా పని చేశారు.