ముగిసిన ములాయం సింగ్ అంత్యక్రియలు.. నివాళులర్పించిన సీఎం కేసీఆర్, చంద్రబాబు
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భౌతిక కాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో యూపీ చేరిన ఆయన.. ఇటావా జిల్లాలో ములాయం స్వగ్రామమైన సైఫయీ వెళ్లారు. అక్కడ ములాయం భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అనంతరం ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు కూడా ములాయం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. బీజేపీ నేత రీటా బహుగుణ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తదితరులు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొని ములాయంకు నివాళులర్పించారు.
https://twitter.com/i/status/













