ఉపరాష్ట్రపతి ఎన్డీయే అభ్యర్థిగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ?
బీజేపీలో కీలక మైనార్టీ నేత, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. అయితే నఖ్వీ రాజీనామాపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీయే అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. అయితే నఖ్వీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలవడం మరింత బలం చేకూర్చినట్లయింది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో మైనార్టీ వర్గంలో కాషాయ పార్టీపై కొంత వ్యతిరేకత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో నఖ్వీని ఉపరాష్ట్రపతి పదవికి బరిలో దించాలని ఎన్డీయేలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.













