ప్రపంచ అత్యంత విలువైన 50 కంపెనీల్లో రిలయన్స్
భారత కుబేరుడు ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీ రిలయన్స్ మాత్రమే. రిల్ షేర్లు 2.30 శాతం పెరిగి గరిష్ఠంగా రూ.2,050 ను తాకింది. దీంతో రిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13 లక్షల కోట్లకు చేరుకున్నది. డాలర్ పరంగా ఇది 173 బిలియన్ డాలర్లతో సమానం. ప్రస్తుతం 171.9 బిలియన్ డాలర్లతో 50 వ స్థానంలో ఉన్న ఒరాకిల్ కార్పొరేషన్ ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించింది.













