మిసెస్ ఇండియా పోటీల్లో… సరిత
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన సిరిపిరెడ్డి సరిత మిసెస్ ఇండియా పోటీల్లో క్లాసిక్ కేటగిరిలో మెరిసి ఫిట్నెస్ దివ బహుమతిని కైవశం చేసుకున్నారు. హైదరాబద్‌లో ఈ నెల 22న మహిళా సాధికారత ఉద్దేశ్యంతో ఇండెన్ రాయల్స్ నిర్వహించిన మిసెస్ ఇండియా ఫైనల్ పోటీల్లో పాల్గొన్న సరిత పలు రౌండ్లలో పాల్గొని ప్రతిభ ప్రదర్శించారు. టాలెంట్ రౌండ్, స్టేట్ రిప్రెసెంటషన్ రౌండ్, స్పోర్స్ రౌండ్, టైటిల్ రౌండ్స్ జరిగాయి. క్లాసిక్ కేటగిరిలో ఫిట్నెస్ దివ బహుమతిని సరిత సాధించారు.
ఈ పోటీలకు ముఖ్య అతిధిగా బిగ్‌బాస్ ఫ్రేమ్, సినీ నటి అర్చన పాల్గొని కిరీటం పెట్టి టైటిల్‌ను ప్రధానం చేశారు. జగ్గయ్యపేట చెందిన సరిత యోగా మాస్టర్ కరణం లుగేంద్ర పిళ్లై సతీమణి, ఆమె క్యాలిటీ ఇంజనీర్‌గా హైదరాబాద్ లోనే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా లుగేంద్ర పిళ్లై- సరిత దంపతులను పలువురు అభినందించారు.













