ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ

ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. రాష్ట్రంలో కమలదళ సీనియర్ నేతల్లో ఒకరైన మాఝీ, ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండున్నర దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జూన్ 12న మాఝీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి మోదీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.