దీపోత్సవం ప్రపంచ రికార్డు
దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీపోత్సవ్‌లో భాగంగా సరయూ నదికి రెండు వైపులా మొత్తం 15,76,000 వేల దీపాలు వెలిగించాయి. దీపోత్సవ్ సందర్భంగా 40 ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీసంఖ్యలో మట్టి దీపాలను వెలిగించిన ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు కెక్కింది. గిన్నిస్ అధికారులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు రికార్డు సర్టిఫికెట్‌ను అందజేశారు. మందిరాలన్నింటినీ అందంగా అలంకరించారు. దీపోత్సవ్‌లో భాగంగా బాణాసంచా కాల్చడంతో పాటు లేజర్ షోను కూడా ఏర్పాటు చేశారు. దీపాల వెలుగులో అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది.













