బాలీవుడ్ నటుడికి ప్రధాని మోదీ ఆహ్వానం
హిమాలయాల్లో ఆధ్యాత్మికత, నిగూఢత్వానికి, దైవత్వానికి నిదర్శనమైన కైలాస పర్వతాన్ని దర్శించుకోలేకపోతున్నానంటూ బాధపడిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఊరట కలిగించారు. కొద్దివారాల్లో కచ్‌లో ఆరంభం కానున్న రణ్ ఉత్సవాలకు ఆయన్ను ఆహ్వానించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీని సైతం మీరు సందర్వించాల్సి ఉందని తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల పార్వీతి కుండ్ జగదీశ్వర్ దేవస్థానాలను సందర్శించిన సందర్భంగా కైలాస పర్వతానికి అభిముఖంగా ధ్యానం చేశారు. ప్రధాని మోదీ పర్యటనను ప్రస్తావిస్తూ కైలాస పర్వతాన్ని దర్శించుకోవడంలో తన అశక్తతను వ్యక్తం చేస్తూ అమిత్బ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆయన పోస్టుకు ప్రధాని మోదీ పై విధంగా స్పందించారు.













