ప్రధానమంత్రుల మ్యూజియం ప్రారంభం
ఢిల్లీలో ఏర్పాటు చేసిన భారత ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేసి మ్యూజియాన్ని సందర్శించారు. ఈ మ్యూజియం గత ప్రధానమంత్రుల కథతో పాటు వారు ఎదుర్కొన్న వివిధ సవాళ్ల ద్వారా దేశాన్ని ఎలా నడిపించారో చెబుతోంది. ఈ మ్యూజియం స్వాతంత్య్ర పోరాటం నుంచి భారత దేశ చరిత్ర యొక్క సంగ్రహావలోకనాలను అందిస్తుంది. భారతదేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు ఈ మ్యూజియాన్ని మోదీ అంకితం చేశారు.
దేశ రాజధానిని ఢిల్లీ లోని తీన్ మూర్తి ఎస్టేట్ లో ఈ మ్యూజియం ఉంది. అభివృద్ధి చెందుతోన్న భారత్‌ను ప్రతిబింబించేలా ఈ మ్యూజియంను రూపొందించారని అధికారులు తెలిపారు. మాజీ ప్రధానుల జీవితాల్లో చోటుచేసుకొన్న అనుభవాలు, వారి హయాంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే క్రమంలో ఎదురైన సవాళ్లను ఈ మ్యూజియం ద్వారా దేశ ప్రజలు తెలుసుకోనున్నారని అధికారులు వెల్లఢిల్లీ చారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా మోదీ ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు.













