ఎన్నికల సంఘం విశ్వసనీయతపై మోదీ క్లారిటీ..

ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రతిపక్షాలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ విపక్షాల వాదనను ఖండించారు. అంతేకాదు అంతకముందు 50-60 సంవత్సరాల పాటు ఎన్నికల సంఘంలో ఒకరే సభ్యులుగా ఉండేవారు అంటూ కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా తన రేంజ్ లో మోదీ సెటైర్లు వేశారు. అంతకముందు ఒక పార్టీకి ఎంతో సన్నిహితంగా ఉండే వారిని ఎన్నికల కమిషనర్లుగా నియమించేవారు అని విమర్శించారు. ఎన్నికల సంఘం కమల దళానికి అండగా ఉంది అంటూ వస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో మోడీ ఈ మేరకు ఎన్నికల సంఘానికి సంబంధించిన సందేహాలను క్లారిఫై చేశారు. ఈ నేపథ్యంలో మోదీ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ అప్పట్లో ఎల్కే అద్వానీ పై పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. 1999 లోక్ సభ ఎన్నికల్లో అద్వానీపై అహ్మదాబాద్ నుంచి అయ్యర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. తమపై గెలవలేక కాంగ్రెస్ అలా మాట్లాడుతోంది అనే ఉద్దేశాన్ని ఆయన ఇన్ డైరెక్ట్ గా కన్వే చేశారు. ఇక 2024లో జరిగిన మొదటి, రెండవ దశ ఎన్నికలకు సంబంధించి ఈసీ విడుదల చేసినటువంటి ఓటింగ్ శాతం డేటాలో వ్యత్యాసాలు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న అనుమానాలను మోదీ ఖండించారు. బీజేపీ నేతృత్వంలో ఎన్నికల సంఘం ఒక బలమైన స్వతంత్ర సంస్థగా ఎదుగుతుంది అని మోదీ స్పష్టం చేశారు.