తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు

కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లో నరసాపురం నుంచి బీజేపీ తరపున తొలిసారి గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మ, టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి గెలిచిన కింజరావు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఉన్నారు. ఇందులో కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయగా, మిగతా ముగ్గురు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.