కేంద్ర కేబినెట్ విస్తరణ ?
కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడో రేపో తన మంత్రిమండలిని విస్తరించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వీరిద్దరూ ప్రధానితో కేబినెట్‌కు తుదిరుపు ఇస్తున్నట్టేనని పలువురు భావిస్తున్నారు. రేపు కొత్త మంత్రివర్గ ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ మిత్రపక్ష పార్టీ నేతలతోపాటు అసోం మాజీ ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, సుశీల్ మోదీలకు మంత్రివర్గంలో స్థానం ఖాయమని విశ్వసనీయవర్గాల సమాచారం.
యూపీ, బెంగాల్ నుంచే ఎక్కువ మందికి మంత్రివర్గంలో చోటు దక్కనుందని సమాచారం. మంత్రివర్గంలో కొత్తవారిని చేర్చుకోవడంతో పాటు పాతవారిని సాగనంపే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019లో మోదీ రెండోదఫా పదవి చేపట్టాక చేస్తున్న తొలి విస్తరణ ఇదే అవుతుంది. ప్రస్తుతం కేబినెట్లో 54 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 81 మంది ఉండొచ్చు.













