పంచాయతీ ఎన్నికల్లో అందాల రాణి పోటీ
ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అందాల నటి, మోడల్ దీక్షా సింగ్ సిద్ధమైంది. నేడో, రేపో దీక్షా పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనుంది. ఔన్‌పూర్ జిల్లాలోని బాక్షా బ్లాక్‌లోని 26వ వార్డు నుంచి దీక్షా తండ్రి జితేంద్ర సింగ్ పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఆ వార్డు మహిళకు రిజర్వు కావడంతో తన కుమార్తెను బరిలోకి దింపాడు. ఔన్‌పూర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఏప్రిల్ 15న జరగనున్నాయి. దీక్షా తండ్రి జితేంద్ర సింగ్ గోవా, రాజస్థాన్‌లో ట్రాన్స్‌పోర్టు బిజినెస్ చేస్తున్నాడు. దీక్షాపై బీజేపీ నాయకుడు దివంగత రామ్ చంద్ర సింగ్ కోడలు శాలిని సింగ్ పోటీ చేస్తున్నారు. దీక్ష స్వస్థలం బక్ష ప్రాంతంలోని చిట్టోరి గ్రామ. అయితే వ్యాపార రీత్యా గోవాలో స్థిరపడింది.
2015లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచిన దీక్షా సింగ్ ప్రైవేటు ఆల్బమ్స్‌తో పాటు పలు ప్రకటనల్లో నటించారు. ఇప్పుడు తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. యూపీలో ఏప్రిల్ 15 నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జాన్పూర్ జిల్లాలో తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 15న పోలింగ్ నిర్వహించనున్నారు.













