ఎలక్ట్రానిక్, వ్యర్థాల అంశంపై ఆలోచించండి- మోదీ
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని, లక్షలాది మంది భారతీయులను బలోపేతం చేసేందుకు త్వరలోనే 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కలిసికట్టుగా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. మొబైల్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. మీలాంటి వారి ఆవిష్కరణలు, ప్రయత్నాల వల్లే మహమ్మారి కాలంలోనూ ప్రపంచం సజావుగా సాగుతోందన్నారు.
టెక్నాలజీతో వచ్చిన అప్డేట్ వల్ల.. హ్యాండ్సెట్ల నుంచి గ్యాడ్జెట్లకు మారామని, అయితే ఎలక్ట్రానిక్, వ్యర్థాల అంశంలో టెక్నాలజీ పరిశ్రమకు చెందిన టాస్క్ ఫోర్స్ ఏదైనా ఆలోచించాలన్నారు. టెలికం పరికరాలను, డిజైన్, డెవలప్మెంట్, ఉత్పత్తి విషయంలో భారత్‌ను ప్రపంచంలోనే టెలికాం హబ్‌గా మార్చాలని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మొబైల్ టెక్నాలజీ వల్ల కోట్లల్లో క్యాష్‌లెస్ లావాదేవీలు జరుగుతున్నాయని, దీని వల్ల పారదర్శకత పెరుగుతుందన్నారు. టోల్‌బూత్‌ల వద్ద కూడా కాంటాక్ట్‌లెస్ సేవలు సాధ్యమైనట్లు చెప్పారు.













