తొలి దశ సక్సెస్.. సజావుగా రెండు రాష్ట్రాల్లో
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో మొదటి అంకం సజావుగా ముగిసింది. మిజోరం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పోలింగ్ విజయవంతమైంది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం మీద రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మిజోరంలో 40 స్థానాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించగా, 77.56 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కొత్త ఓటర్లతో పాటు వృద్ధులు కూడా ఓటేయడానికి ఆసక్తి చూపడం వల్లే భారీ సంఖ్యలో ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.













