సెప్టెంబరు 1 నుంచి మెట్రో స్టార్ట్ ?
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా నిలిచినపోయిన మెట్రో రైళ్ల సేవలు వచ్చే నెలలో తిరిగి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 1 నుంచి మైట్రో రైళ్లను నడపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. హోంశాఖ త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తుందని చెప్పారు. లాక్డౌన్ నిబంధనల సడలింపుల్లో భాగంగా ప్రకటించిన అన్లాక్ 3.0 గడువు ఈ నెల 31తో ముగియనున్నది. అన్లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయనున్నది. నీట్, జేఈఈ పరీక్షలను సెప్టెంబర్లో నిర్వహించనున్న నేపథ్యంలో బడులు, కాలేజీలను కూడా తెరుస్తారా ..అన్నా అంశంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
అయితే అన్లాక్ 4.0 లో విద్యాలయాలను తెరిచే అవకాశం లేదని అధికారులు చెప్పారు. యూనివర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలను తెరవాలనే చర్చ వచ్చినప్పటికీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సినిమా హాళ్ల మీద నిషేధం కొనసాగుతుందని చెప్పారు. భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడపడం ఆర్థికంగా చాలా కష్టమని అన్నారు. బార్లలో కేవలం టేక్ అవే సౌక్యరాన్ని మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపారు. కేంద్రం ప్రకటించనున్న అన్లాక్ 4.0 విధి విధానాల్లో కేవలం వేటిపై నిషేధం ఉంటుందో వాటిని మాత్రమే పేర్కొంటారని, మార్గదర్శకాల్లో పేర్కొనని వాటిపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని చెప్పారు.













