పోలీస్ యాప్ తో ఎం పాస్ పోర్టు
పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారు స్లాట్స్ కోసం చాలా సమయం వేచి చూడాల్సి వస్తోంది. పాస్‌పోర్టులకు డిమాండ్ భారీగా పెరగడంతో పాస్ పోర్టుల జారీలో జాప్యం జరుగుతున్నది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎం పాస్‌పోర్టు పోలీస్ యాప్ తీసుకువచ్చింది. దీని వల్ల ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. పాస్‌పోర్టు జారీ చేసేందుకు పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. దీనికి ఒక్కసారి సమయం ఎక్కువ తీసుకుంటున్నది. పోలీసులు ఇంటికి వచ్చి సేకరించిన వివరాలను ఎం పాస్‌పోర్టు పోలీస్ యాప్ నుంచి నేరుగా సబ్మిట్ చేస్తారు. దీంతో ఈ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. పోలీస్ వెరిఫికేషన్‌ను 15 రోజుల వ్యవధి 5 రోజులకు తగ్గుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. మొత్తంగా పాస్‌పోర్టు జారీ సమయం 10 రోజులకు తగ్గుతుందని తెపింది. దేశవ్యాప్తంగా 555 పాస్‌పోర్టు కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 36 పాస్‌పోర్టుల ఆఫీస్‌లు, 93 పాస్ పోర్టు సేవా కేంద్రాలు, 428 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయి.













