బెంగళూరు మేయర్ సెల్ఫ్ క్వారెంటైన్
బెంగళూరు మేయర్ గౌతమ్ కుమార్ సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లాడు. ఇన్నాళ్లు తన వెంబడే తిరిగిన తన అసిస్టెంట్‌కు కరోనా వైరస్ సోకిందని తేలడంతో మేయర్ ఎమ్ గౌతమ్ కుమార్ తనకు తాను క్వారంటైన్ విధించుకున్నారు. మేయర్తోపాటే ఆయన కార్యాలయ సిబ్బంది కూడా ఎవరికివారే క్వారంటైన్లోకి వెళ్లారు. అదేవిధంగా మేయర్ కార్యాలయాన్ని అధికారులు సీల్ చేశారు. అక్కడ పూర్తి శానిటైజేషన్ నిర్వహించిన తర్వాతే తిరిగి కార్యాలయం తెరుచుకుంటుందని తెలిపారు. ఇదిలావుంటే మేయర్ అసిస్టెంట్‌కు కరోనా ఎలా సోకిందనే దానిపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల ఆయన ఓ కాంట్రాక్టర్‌తో సమావేశంలో పాల్గొన్నారని, ఆ తర్వాత ఆ కాంట్రాక్టర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయన ద్వారానే మేయర్ అసిస్టెంట్‌కు కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.













