ఎవరితో పొత్తు లేదు.. ఒంటరిగానే పోరు
లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరు చేయనున్నట్లు బీఎస్పీ నేత మాయవతి క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదన్నారు. తమ పార్టీ స్వంతంగానే ఎన్నికల బరిలో దిగుతుందన్నారు. ఎన్నికల వేళ వస్తున్న ఊహాగానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. తమ పార్టీపై కొందరు పొత్తు గురించి రూమర్లు చేస్తున్నారని, అంటే తమ ప్రమేయం లేకుండా ఎవరి గెలువరన్న విషయం స్పష్టం అవుతోందని ఆమె అన్నారు. ప్రజల ప్రయోజనం, సంక్షేమం కోసం రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు మాయావతి తెలిపారు.













