ఎయిరిండియా పై సైబర్ దాడి… 45 లక్షల

దేశీయ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కు చెందిన సిటా పీఎస్‍ఎస్ ప్యాసింజర్ సర్వీస్ సిస్టమ్‍పై భారీ సైబర్ దాడి జరిగింది. దాదాపు 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ దుండగులు దొంగిలించారు. లీకైన సమచారంలో ప్రయాణికుల పాస్‍పోర్ట్ వివరాలు, అడ్రస్, టికెట్ సమాచారం, క్రెడిట్ కార్డ్ వివరాలు వంటివి ఉన్నట్టు ప్రయాణికులకు పంపిన ఓ లేఖలో ఎయిరిండియా స్వయంగా వెల్లడించింది. ప్రయాణికుల సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్టు ఫిబ్రవరి 25వ తేదీన గుర్తించామని, అయితే దానికి సంబంధించిన వివరాలు మార్చి 25, ఏప్రిల్ 5 తర్వాతనే తెలిసినట్టు సంస్థ వివరించింది.
ఎస్‍ఐటీఏ పీఎస్‍ఎస్ ప్యాసింజర్ సర్వీస్ సిస్టమ్ (సర్వర్)పై దాడి జరిగిందని తెలియగానే నిపుణుల సాయంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. సర్వర్ పాస్‍వర్డ్లను కూడా మార్చినట్టు తెలిపింది. ప్రయాణికులు కూడా తమ లాగిన్ క్రెడిన్షియల్స్, మనీ పేమెంట్ కార్డుల పాస్‍వర్డులను మార్చుకోవాలని సూచించింది. అయితే సైబర్ దాడికి ఎవరు పాల్పడ్డారన్న విషయాన్ని వెల్లడించలేదు.