రూ.5 లక్షల మాస్క్!

కాన్పూర్ వాసి మనోజ్ సెన్గర్ అలియాస్ మనోజానంద్ మహరాజ్ రూ.5 లక్షలు పెట్టి మేలిమి బంగారంతో ముంబైలో మాస్క్ చేయించుకున్నారు. మాస్క్లోపల శానిటైజర్ సొల్యూషన్ ఉంటుందని, అది 36 నెలల పాటు పని చేస్తుందని ఆయన చెబుతున్నారు. మనోజ్ సెన్గర్‍ను స్థానికులు యూపీ బప్పి లహరి, కాన్పూర్ గోల్డెన్ బాబా అని పిలుస్తుంటారు.