మంత్రి పదవులకు సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా
ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా, అంతకముందు మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేందర్ జైన్లు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలను సీఎం కేజ్రీవాల్ ఆమోదించారు. అరెస్టయిన నేతలను ఇంకా కేబినెట్లో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ బీజేపీ చేస్తోన్న విమర్శల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకంది. దాదాపు 10 నెలలుగా సత్యేందర్ జైన్ జైలులో ఉండటంతో ఆయన నిర్వహించిన ఆరోగ్యశాఖతో పాటు మొత్తం 18 మంత్రిత్వశాఖలకు సిసోదియానే ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ పరిణామంతో త్వరలోనే కేబినెట్ విస్తరణ చేపట్టి కొత్త మంత్రులను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ కేబినెట్లో సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఐదుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు.













