మనీష్ సిసోడియాకు ఆ ఆవకాశం ఇవ్వాలా…
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయ్యి జైలులో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తనకు తన బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. తన భార్య వైద్య ఖర్చులతో పాటు ఇతర ఇంటి ఖర్చులకు నగదు అవసరం ఉన్నదని, కానీ కోర్టు నుంచి అనుమతి పత్రం లేకుండా నగదు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ఒప్పుకోవడం లేదని సిసోడియా తన పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని సిసోడియా కోర్టును కోరారు. దాంతో ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నోటీసు జారీ చేసింది. మనీష్ సిసోడియాకు బ్యాంకు నగదు ఉపసంహకరణ అనుమతిపై అభిప్రాయం తెలియజేయాలని ఆ నోటీస్‌లో ఈడీనీ ఆదేశించింది.













