బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం… ఇకపై ముఖ్యమంత్రే
బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని యూనివర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్ కాకుండా ముఖ్యమంత్రే ఛాన్సలర్‌గా ఉండేలా చర్యలు తీసుకోంది. ఈ మేరకు అసెంబ్లీలో ఓ బిల్లును కూడా ప్రవేశపెడతామని బెంగాల్ విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ వ్యవస్థపై బెంగాల్లో కొన్ని రోజులుగా తీవ్ర వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఛాన్సలర్ హోదాలో గవర్నర్ కొన్ని యూనివర్శిటీలను వీసీలను నియమించారని సీఎం మమతా తీవ్రంగా మండిపడ్డారు. ఈ కారణంగానే గవర్నర్ అధికారాల్లో కోత విధించడానికి గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.













