అది నాకు అదృష్టాన్నిచ్చే ప్రాంతం : మమత
రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తెలిపారు. ప్రస్తుతం భోవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత సువేందు అధికార పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానమైన నందిగ్రామ్ నుంచి మమత పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. నేను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తాను. అది నాకు అదృష్టాన్నిచ్చే ప్రాంతం అని మమత ఓ ఎన్నికల సమావేశంలో తెలిపారు. కోల్కతాలోని భోవానిపూర్ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు మమత వెల్లడించారు.













