దీదీ పోటీ చేసేది అక్కడి నుంచే!

పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసిన మమత బెనర్జీ ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో దీదీ మళ్లీ ఎక్కడి నుంచి పోటీకి దిగుతారనే ఉత్కంఠ నెలకొంది. దీంతో ఆరు నెలల్లోగా ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి మమత బెనర్జీ గెలుపొందాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇప్పటికే రెండుసార్లు ఎన్నికైన భవానీపూర్ నుంచే మళ్లీ పోటీ చేసేందుకు దీదీ సిద్ధమయ్యారు. దీనికోసం ఆ స్థానం నుంచి గెలుపొందిన సీనియర్ నాయకుడు సోభాందేవ్ ఛటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‍కు రాజీనామా పంపగా ఆయన ఆమోదం తెలిపారు. దీంతో భవానీపూర్‍కు జరిగే ఉప ఎన్నికలో మమతా పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యే కాని వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆరుమాసాల్లోగా ఎన్నిక కావాలి లేదా రాజీనామా చేయాలి అని రాజ్యాంగలోని 164వ అధికారం చెప్తున్నది.