కాంగ్రెస్ కు మమత బెనర్జీ షాక్…. ఎన్నికలకు ఒంటరిగానే
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని దీదీ వెల్లడించారు. బెంగాల్ వరకు సీట్ల పంపకం విషయంలో మా పార్టీ కాంగ్రెస్తో టచ్లో లేదు. ఈ అంశంపై మేం ఇప్పటివరకు ఆ పార్టీలో ఎవరితోనూ మాట్లాడలేదు. మా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో మేం ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం అని మమత స్పష్టం చేశారు.













