మమత బెనర్జీ ఎక్కడి నుంచి పోటీ?

బెంగాల్ ఎన్నికల్లో 200కు పైగా సీట్లతో విజయఢంకా మోగించిన తృణమూల్ కాంగ్రెస్‍కు నందిగ్రామ్‍లో చేదు అనుభవం ఎదురైంది. తృణమూల్ అధినాయకి మమతా బెనర్జీ పరాజయం పాలయ్యారు. అక్కడ శాసన మండలి లేకపోవడంతో పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఆమె తప్పనిసరిగా ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందాల్సి ఉంటుంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దాహా స్థానానికి తృణమూల్ తరపున పోటీ చేసిన కాజల్ సిన్హా గెలుపొందారు. అయితే కొవిడ్ దెబ్బకు సిన్హా గత నెలలో మృతి చెందారు. మరోవైపు ఆర్‍ఎస్‍పీ అభ్యర్థి మరణించడంతో జంగీపుర్, కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూయడంతో శంషేర్‍గంజ్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మూడింటిలో ఏదో ఒకదాన్నుంచి మమత బెనర్జీ పోటీ చేసే అవకాశాలున్నాయి. దీంతో అక్కడ ఉప ఎన్నిక తప్పనిసరిగా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూడు సీట్లపై అందరి దృష్టి నెలకొంది.