అలాంటి వ్యవహారాల్లోకి తన పేరు లాగొద్దు : మమతా
అవినీతికి పాల్పడే వారు, తప్పులు చేసే వారికి తాను మద్దతుగా నిలువబోనని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణంలో మంత్రి పార్థ చట్టర్జీని ఈడీ అరెస్టు చేసిన రెండు రోజులకు మమత ఈ మేరకు స్పందించారు. ఓ ర్యాలీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా తప్పు చేసినట్లు నిరూపితమైతే వాళ్లకి యావజ్జీవ శిక్ష పడినా తానేం అనుకోనని తెలిపారు. అలాంటి వ్యవహారాల్లోకి తన పేరు లాగొద్దని సూచించారు. తాను ప్రభుత్వం నుంచే వచ్చే జీతం కూడా తీసుకోవట్లేదని వెల్లడిరచారు. తప్పులు చేసినవారికి సరిదిద్దుకునేందుకు ఓ అవకాశం ఇవ్వాలని అన్నారు. అందరూ సాధువులు అని తాను భావించట్లేదని, కానీ ఇప్పటి వరకు తాను తెలిసి ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు.













