ఏళ్లు గడుస్తున్నా ఆ విషయం తెలియకపోవడం … దేశానికే అవమానకరం!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమై ఏళ్లు గడుస్తున్నా ఆయనకు ఏమైందనే విషయం కాని, ఆయన మరణించిన తేదీ కాని దేశ ప్రజలకు ఇప్పటికీ తెలియకపోవడం అవమానకరమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. నేతాజీ 127వ జయంతి సందర్భంగా కోల్కతాలోని ఆయన విగ్రహానికి నివాళలర్పించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం దాన్ని ఇంతవరకు నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఎన్నో ఏళ్లు గడుస్తునా, నేతాజీ చనిపోయిన తేదీ తెలియకపోవడం దేశ దురదృష్టం. ఆయనకు ఏమైందో మనకు తెలియదు. నిజంగా దేశానికి ఇది సిగ్గుచేటు అని పేర్కొన్నారు.













