సీఎం మమత బెనర్జీ కీలక నిర్ణయం… ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల వేతనాలు పెంచారు. ఏప్రిల్ 1 నుంచి అంగన్వాడీ, ఆశా వర్కర్లకు పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు నెలకు రూ.750 చొప్పున పెంచామని మమతా బెనర్జీ ప్రకటించారు. అంగన్వాడీ వర్కర్ల వేతనాలు రూ.8250 నుంచి రూ. 900కు పెరగ్గా, ఆశా వర్కర్ల వేతనాలు రూ.6500కు పెరిగాయి. ఆశా వర్కర్లు కష్టపడి పనిచేస్తారని, సంక్లిష్ట సమయాల్లో వారు తమకు అండగా నిలిచారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. వారి వేతనాలు ఏప్రిల్ నుంచి 750 పెంచుతున్నామని ప్రకటించడం తనకు సంతోషం కలిగిస్తోందని ఆమె వెల్లడించారు.













