ఆసుపత్రి నుంచి మమత డిశ్చార్జ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన మమత అనంతరం తనపై దాడి జరిగిందని మీడియాకు తెలిపారు. కారు వద్ద కొందరు తనను తోసివేయడంతో కాలికి తీవ్ర గాయమైందని చెప్పారు. ఆ సమయంలో పోలీసులు ఎవరూ పక్కన లేరని, ఈ దాడి వెనుక కుట్ర ఉన్నదని ఆరోపించారు. దీంతో మమతను కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె పరిస్థితి మెరుగుపడటంతో పలు వైద్య సూచనలతో డిశ్చార్జ్ చేశారు.













