మోదీకి దీదీ వార్నింగ్… రానున్న ఎన్నికల్లో
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజా ప్రభుత్వాలను గద్దెదింపుతున్నారని మండిపడ్డారు. మోదీ సర్కార్ను దేశ ప్రజలు రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో కూల్చివేస్తారని హెచ్చరించారు. ప్రతీకారేచ్చతో రగులుతూ అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వాలను కూల్చుతోందని ఆరోపించారు. మహారాష్ట్రలో వారు గెలిచినా ప్రజల హృదయాలను వారు గెలవలేరని అన్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతన్న ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు.













