మమతా బెనర్జీ సంచలన నిర్ణయం…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఎన్నికల సమావేశాలు, సభలను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించింది. పాదయాత్రలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. అలాగే, బహిరంగ సభలకు 500 మందికి మాత్రమే అనుమతించాలని సూచించింది. బంగాల్లో ఇప్పటికే ఆరు విడతల ఎన్నికలు పూర్తికాగా, మిగిలిన రెండు విడతల ఎన్నికలకు ఈ ఆంక్షలు వర్తించేలా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిరే రోడ్ షోలు, సైకిల్, బైక్, ఇతర వాహనాల ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసి ఉంటే వాటిని ఉపసంహరించుకోవాలని ఆధికారులను ఆదేశిస్తూ..బెంగాల్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మమత ఎన్నికల సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు ప్రధాని మోదీ సైతం సభను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.













