కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలు చేపట్టేది ఎప్పుడో చెప్పిన సూర్జేవాలా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మల్లిఖార్జున్ ఖర్గే.. ఈ నెల 26న తన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎంపీ రణ్‌దీప్ సుర్జేవాలా అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 9,385 ఓట్లు పోలవగా వాటిలో ఖర్గేకు 7,897 ఓట్లు పడ్డాయి. శశిథరూర్‌కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 416 ఓట్లు చెల్లనివి. దీంతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే గెలిచినట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ప్రకటించారు.













