కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా… బాధ్యతలు స్వీకరించిన ఖర్గే
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించారు. సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖర్గేకు ఈ సందర్భంగా రాహుల్ పుష్పగుచ్చం అందించారు. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో గాంధీయేతర వ్యక్తి ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. సోనియా గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఖర్గేకు ఎన్నికల్లో గెలిచిన సర్టిఫికేట్ను అందజేశారు. తనకు మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒక ప్రతినిధికి ఖర్గే ధన్యవాదలు తెలిపారు. ఓ కార్మికుడికి కుమారుడు, ఓ కాంగ్రెస్ వర్కర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారని, తనకు ఉన్న పనితనం, అనుభవంతో ఈ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.













