కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నే.. శశిథరూర్ ఓటమి
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో సోనియా గాంధీ స్థానంలో కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టేది ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుదిగా గాంధీ కుటుంబం మద్దతు ఉన్న మల్లికార్జున ఖర్గేనే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎంపీ శశిథరూర్‌పై ఆయన భారీ తేడాతో నెగ్గా రు. ఈ ఎన్నికల్లో ఖర్గేకు ఏకంగా 7,897 ఓట్లు రాగా, శశిథరూర్‌కు కేవలం వెయ్యి ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 416 ఓట్లు చెల్లవని కమిటీ తెలిపింది . ఈ ఎన్నికలు ఈనెల 17న జరిగిన సంగతి తెలిసిందే. 137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇప్పటివరకు అధ్యక్ష పదవికి ఆరుసార్లు మాత్రమే ఎన్నిక జరిగాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేతలు శశి థరూర్, మల్లిఖార్జున ఖర్గే పోటీపడిన సంగతి తెలిసిందే.













