ఖర్గే కీలక వ్యాఖ్యలు.. బీజేపీని ఓడించేందుకు ఆ పార్టీలతో
పొత్తుల అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన 85వ పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. పొత్తులతోనే 2024 ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. బీబీజేపీ ఓడించేందుకు భావసారుప్యం కలిగిన పార్టీలతో కలవనున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో రాజ్యాంగంపైనా, ప్రజాస్వామిక విలువలపై నిత్యం దాడి జరుగుతోందన్నారు. దేశ సరిహద్దులో చైనా నుంచి ముప్పు పొంచి ఉందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమ్యలు వెంటాడుతున్నాయని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సమర్థమైన నాయకత్వాన్ని అందించగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. 2004 నుంచి 2014 వరకు భావసారుప్యం కలిగిన పార్టీతో కలిసి దేశానికి ఏవిధంగా సేవ చేశామో, అదే తరహాలో మరోసారి అలాంటి పార్టీలతో కలిసి ప్రజావ్యతిరేకత బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుతామని అన్నారు. ఢల్లీిలో ఉన్నది పేదలకు వ్యతిరేక ప్రభుత్వం అని, అది ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుంటే, దేశాన్ని ఏకం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు.













