ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రధానికి … ఆసక్తి లేదు
మణిపుర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఖర్గే మీడియాతో మాట్లాడుతూ మణిపూర్ పై పార్లమెంట్లో ప్రకటన చేయాలని తాము కోరుతుంటే సభ నడుస్తుండగా ఆయన రాజస్థాన్‌లో రాజకీయ ప్రసంగాలు, ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని మండిపడ్డారు. రాజస్థాన్‌లో ర్యాలీలకు హాజరైన ప్రధానికి అరగంట సమయం సభకు హాజరైన ప్రకటన చేసేందుకు సమయం లభించడం లేదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి మణిపూర్ అంశంపై మాట్లాడేందుకు ఆసక్తి లేదని, ఆయన ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని వెల్లడవుతోందని అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడాలని ఆయన కోరుకోవడం లేదని తెలిపారు. పార్లమెంట్‌ను ప్రధాని మోదీ అవమానిస్తున్నారని ఆరోపించారు.













