18 నుంచి పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల సన్నాహాలపై నేతలకు వివరించారు. సమావేశం అనంతరం స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి ఆగస్ట్ 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయన్నారు. సమావేశాలకు సంబంధించి అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమైన అంశాలపై చర్చించాలని అన్ని పార్టీల నేతలను కోరానన్నారు. సభ గౌరవ ప్రదంగా నడిచేలా, సభా కార్యక్రమాలకు సహకరిస్తామని అన్ని పార్టీల నేతలు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
కాంగ్రెస్ నేత అధిర్‌రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి, బీజేపీ ఎంపీ అర్జున్ రామ్ మేఫ్‌ువాల్, వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఆర్ఎల్జేపీ ఎంపీ పశుపతి కుమార్ పరాస్తో పాటు పలు పార్టీల ఎంపీలకు ఈ సమావేశానికి హాజరయ్యారు.













